తెలంగాణ

telangana

ETV Bharat / state

మీరు పైసా ఇవ్వకున్నా... మేం ఎంతో చేశాం: కేటీఆర్ - Minister Ktr latest updates

ఆరేళ్లలో హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక్కపనైనా చెప్పాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. రోడ్​షోల ద్వారా జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన కేటీఆర్... తెరాస సర్కార్ పాలనలో భాగ్యనగర అభివృద్ధికి ఎంతో చేశామని వివరించారు. కొందరు ఓట్ల కోసం అందరి హైదరాబాద్​ను కొందరిదిగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. అన్ని వర్గాలను కలుపుకొని హైదరాబాద్​ను అభివృద్ధి చేస్తుంటే అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

మీరు పైసా ఇవ్వకున్నా... మేం ఎంతో చేశాం: కేటీఆర్
మీరు పైసా ఇవ్వకున్నా... మేం ఎంతో చేశాం: కేటీఆర్

By

Published : Nov 21, 2020, 8:44 PM IST

బల్దియా ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్​ రోడ్​షోలను ప్రారంభించారు. కూకట్​పల్లి ఓల్డ్ అల్లాపూర్‌, మూసాపేట, బాలానగర్‌ చౌరస్తాలో ప్రచారం నిర్వహించారు. తెరాస అభ్యర్థులను గెలిపిచి.. ఈసారి 100 స్థానాలు గెలిచేలా దీవించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు.

మభ్యపెట్టే హామీలు...

ఆరేళ్లలో తెరాస సర్కార్ పాలనలో హైదరాబాద్ సమగ్ర అభివృద్ధికి ఎన్నో పనులు చేశామని వివరించారు. నిరంతర విద్యుత్ పాటు తాగునీటి ఎద్దడిని నివారించిన ఘనత తెరాసకే దక్కుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓట్ల కోసం భాజపా రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టేందుకు హామీలు ఇస్తోందని విమర్శించారు.

భాజపాపై విమర్శలు ఎక్కుపెట్టిన కేటీఆర్

మీరే తేల్చుకోండి...

తెరాస సర్కార్ పాలనలో హైదరాబాద్ శాంతిభద్రతలతో ప్రశాంతంగా ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి హైదరాబాద్ కావాలా? ఆరాచకా హైదరాబాద్ కావాలా తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు.

వంద అభివృద్ధి పనులు చూపెడతా: కేటీఆర్

ఇదీ చూడండి:'ఇది అమాయకపు అహ్మదాబాద్ కాదు హుషార్ హైదరాబాద్'

ABOUT THE AUTHOR

...view details