తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెలంగాణలో ఆంధ్రా పెత్తనం ఉండాలని ఉత్తమ్ కోరుకుంటున్నరు' - హరీశ్ రావు వార్తలు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లయ్యాక కూడా హైదరాబాద్‌పై ఆంధ్రప్రదేశ్ పెత్తనం ఉండాలని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరుకుంటున్నారా అని మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు చేయాలన్న ఉత్తమ్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వమే స్వచ్ఛందంగా సచివాలయాన్ని అప్పగించిన తర్వాత సెక్షన్ 8 ప్రశ్నే ఉత్పన్నం కాదని మంత్రి ట్వీట్ చేశారు.

harish rao
harish rao

By

Published : Jul 7, 2020, 6:55 PM IST

Updated : Jul 7, 2020, 7:45 PM IST

హైదరాబాద్‌లో విభజన చట్టంలోని సెక్షన్ 8 అమలు చేయాలన్న పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌ రావు ట్విట్టర్‌లో స్పందించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్ల తర్వాత కూడా హైదరాబాద్‌ మీద ఆంధ్రప్రదేశ్‌కు పెత్తనం ఉండాలనుకుంటున్నారా అని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డిని మంత్రి ప్రశ్నించారు.

ఏపీ ప్రభుత్వమే స్వచ్ఛందంగా సచివాలయాన్ని, ప్రభుత్వ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించిన తర్వాత సెక్షన్ 8 ప్రశ్నే ఉత్పన్నం కాదని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రాంత ముఖ్యమంత్రుల వద్ద పనిచేసిన ఉత్తమ్‌ ఇంకా అదే మనస్తత్వంతో కొనసాగుతుందన్నారని విమర్శించారు.

ఇదీ చదవండి :'ఇది చాలా హేయమైన చర్య... సీఎం ఎక్కడున్నారు?'

Last Updated : Jul 7, 2020, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details