తెలంగాణ

telangana

ETV Bharat / state

Minister Gangula Kamalakar: 'కేంద్రం ధాన్యం కొనే వరకు పోరాటం ఆగదు'

Minister Gangula Kamalakar: ధాన్యం కొనుగోళ్ల అంశంలో కేంద్రం మెడలు వంచుతామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. భాజపాను దోషిగా నిలబెడతామన్నారు. రేపు దిల్లీలో దీక్ష అనంతరం తదుపరి ఏం చేయాలో.. సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారంటున్న గంగుల కమలాకర్‌తో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

Minister Gangula Kamalakar: 'కేంద్రం ధాన్యం కొనే వరకు పోరాటం ఆగదు'
Minister Gangula Kamalakar: 'కేంద్రం ధాన్యం కొనే వరకు పోరాటం ఆగదు'

By

Published : Apr 10, 2022, 5:30 AM IST

'కేంద్రం ధాన్యం కొనే వరకు పోరాటం ఆగదు'

Minister Gangula Kamalakar: ధాన్యం కొనుగోళ్ల అంశంలో కేంద్రం మెడలు వంచుతామని, దోషిగా నిలుపుతామని పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఆహారధాన్యాల కొనుగోళ్ల విషయంలో ఉన్న విధానాన్నే కొనసాగించాలని తెలంగాణ కోరుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యాపారసంస్థలా ఆలోచిండం తగదని, రైతుల విషయంలో లాభనష్టాలు చూడడం తగదని వ్యాఖ్యానించారు. 11వ తేదీన దిల్లీలో దీక్ష అనంతరం కేంద్ర వైఖరిని ధాన్యం కొనుగోళ్ల విషయంలో తదుపరి ఏం చేయాలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని గంగుల కమలాకర్ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details