- భారత వైమానిక దళానికి చెందిన ఈ హెలికాప్టర్ ఎలాంటి పరిస్థితుల్లో పయనిస్తుంది?
ఇవాళ జరిగిన ఘటన చాలా దురుదృష్టకరం. ఈ ఎంఐ17 అనే హెలికాప్టర్‌ను సైనికులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లడానికి వాడుతారు. చాలా వరకు భూభాగం సరిగా లేనపుడు, రోడ్డు సరిగా లేనపుడు దీనిని వాడుతారు. అదికాకుండా యుద్ధం జరిగినపుడు సైనికులను, గాయపడ్డ వారిని తరలించడానికి వాడుతారు. సీనియర్ అధికారులను తరలించడానికి కూడా వినియోగిస్తారు. ఇవాళ జరిగిన ఘటన అయితే సీడీఎస్ బిపిన్ రావత్ కోయంబత్తూరు నుంచి స్టాఫ్ కాలేజీలో లెక్చర్ ఇవ్వడానికి వస్తున్నారు. సరిగ్గా స్టాఫ్ కాలేజీ చేరే ముందు క్రాష్ కావడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. రవాణా కోసమే ఈ హెలికాప్టర్ వాడడం జరుగుతుంది.
- ఈ హెలికాప్టర్ సామర్థ్యం ఎంత? ఎంత మంది ప్రయాణించొచ్చు?. అదే విధంగా ప్రతికూల పరిస్థితుల్లో గాల్లోకి ఎగురుతుందా?
రిపోర్ట్స్ ప్రకారం ఈ హెలికాప్టర్లో 18 మంది ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. ఇది రష్యాలో తయారైన హెలికాప్టర్. మన దగ్గరికి నాలుగైదు సంవత్సరాల క్రితం కొత్త వర్షన్స్ వచ్చాయి. దీనికి ముందు ఈ హెలికాప్టర్ కూలిన దాఖలాలు కూడా లేవు. చాలా సురక్షితమైన హెలికాప్టర్. ఈ హెలికాప్టర్ ఎగిరే ముందే అన్ని అంశాలను పరీక్షిస్తారు. ఇలాంటి ప్రమాదాలు మూడు కారణాల వల్ల జరుగుతాయి. అవి ఏంటంటే మానవ తప్పిదం అనగా పైలెట్ తప్పు వల్ల కావచ్చు. సాంకేతిక లోపం వల్ల కావచ్చు. వాతావరణ పరిస్థితులు సరిగా లేనప్పుడు ఇలాంటివి జరుగుతాయి. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో విచారణలో తెలుస్తుంది. బిపిన్ రావత్ ఉన్నత స్థానంలో ఉన్నారు కాబట్టి అన్ని అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది.
- ప్రధానంగా ఈ హెలికాప్టర్‌ను ఎటువంటి సమయాల్లో ఉపయోగిస్తారు?