తెలంగాణ

telangana

ETV Bharat / state

వలసకూలీల కోసం రోజుకు 11 రైళ్లు - corona virus

రాష్ట్రంలోని వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపే ప్రక్రియ జోరుగా సాగుతోంది. సీఎం కేసీఆర్‌ ప్రకటించినట్లుగా రోజూ శ్రామిక్‌ రైళ్ల ద్వారా వేలాది మంది వలస కార్మికులను స్వస్థలాలకు తరలిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల నుంచే స్పందన వచ్చిందని.. అందుకే 11 రైళ్లను మాత్రమే నడుపుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​ వెల్లడించారు.

migrated-labour-shifting-from-telangana
వలసకూలీల కోసం రోజుకు 11 రైళ్లు

By

Published : May 7, 2020, 8:50 PM IST

Updated : May 8, 2020, 12:04 AM IST

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. వలస కూలీల కోసం రోజుకు 40 రైళ్లను నడపడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయగా... కేవలం కొన్ని రాష్ట్రాల నుంచే స్పందన వచ్చిందని సీఎస్​ సోమేశ్​కుమార్​ తెలిపారు. మిగిలిన రాష్ట్రాలు కూలీలు తమ రాష్ట్రానికి వస్తే ఏర్పాట్లు చేయడానికి కొంత సమయం పడుతుందని చెప్పడం వల్ల రోజుకు 11 రైళ్లను మాత్రమే నడుపుతున్నట్లు సీఎస్ సోమేష్ కుమార్ వెల్లడించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా ఆరా తీసినట్లు వివరించారు. వలస కూలీల తరలింపు ప్రక్రియను సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, సీఎస్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు.

లాటరీ పద్ధతి ద్వారా తరలింపు

కూలీల తరలింపునకు ఇప్పటికే ప్రధాన రాష్ట్రాలు అయిన మధ్యప్రదేశ్, చత్తీస్​గఢ్​, ఒడిశా, పశ్చిమ బంగాల్​, ఉత్తరప్రదేశ్, ఝార్ఘండ్, రాజస్థాన్ సీఎస్​లకు లేఖ రాశామని తెలిపిన ఆయన...కొన్ని రాష్ట్రాల నుంచి తరలింపు ప్రక్రియకు గ్రీన్​సిగ్నల్ రావాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకూ 2.78 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని సోమేశ్​కుమార్​ తెలిపారు. ఎక్కువగా ఉత్తరప్రదేశ్ నుంచి 67 వేలు, బిహార్ నుంచి 66వేలు, పశ్చిమ బంగాల్ నుంచి 45వేలు, ఒడిశా నుంచి 34 వేలు, జార్ఖండ్ నుంచి 29 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిని కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా లాటరీ సిస్టమ్​తో తరలిస్తున్నామని పేర్కొన్నారు. వారి పేర్లు వచ్చినపుడు వారికి తెలియజేస్తున్నామన్నారు. తెలంగాణా ప్రభుత్వం 13 రైళ్లకు గాను 1.65 కోట్ల రూపాయలను రైల్వే శాఖకు ఇప్పటికే చెల్లించినట్లు ఆయన తెలిపారు.

ఇవీ చూడండి: రాష్ట్రాల్లోని పరిస్థితులను గమనించాలి : కేటీఆర్​

Last Updated : May 8, 2020, 12:04 AM IST

ABOUT THE AUTHOR

...view details