తెలంగాణ

telangana

ETV Bharat / state

'నగరం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తోంది' - metro md nvs reddy

రియల్​ఎస్టేట్​లో హైదరాబాద్​ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని మెట్రో రైల్ ఎండీ ఎన్​వీఎస్​ రెడ్డి తెలిపారు. ఈనాడు ప్రాపర్టీ షోను అందరూ వినియోగించుకోవాలని సూచించారు.

metro md nvs reddy starts eenadu property show
'నగరం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తోంది'

By

Published : Jan 4, 2020, 1:05 PM IST

హైదరాబాద్‌ను ప్రపంచానికి గమ్యస్థానంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని మెట్రో రైల్‌ ఎండీ ఎన్​వీఎస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్​ మాదాపూర్ సైబర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈనాడు ఆధ్వర్యంలో 2రోజుల పాటు ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభించారు.

స్థిరాస్తి వ్యాపారం దేశమంతటా తిరోగమనంలో ఉన్నా... హైదరాబాద్‌లో మాత్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తోందని ఎన్​వీఎస్ రెడ్డి వివరించారు. దేశానికే కాకుండా ప్రపంచానికి కూడా హైదరాబాద్​ నడిబొడ్డుగా అయ్యే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈనాడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 30వ ప్రాపర్టీ షోను అందరూ వినియోగించుకోవాలని కోరారు.

'నగరం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తోంది'

ఇవీ చూడండి: మూడేళ్ల చిన్నారికి ఓటు హక్కు.. వయసు 35 ఏళ్లు

ABOUT THE AUTHOR

...view details