ETV Bharat / state

మూడేళ్ల చిన్నారికి ఓటు హక్కు.. వయసు 35 ఏళ్లు

రాష్ట్రంలో పురపాలక ఎన్నికల నేపథ్యంలో జిల్లాల వారీగా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. కానీ ఒక్కో జిల్లాలో ఒక్కొ విధంగా రకరకాలు తప్పులు బయటపడుతున్నాయి. ఇటీవల నిర్మల్​ జిల్లాలో ఒక వార్డులోని ఓటర్ల పేర్లు మరొక వార్డులో తప్పుగా వచ్చాయి. తాజాగా కరీంనగర్‌ జిల్లాలో మూడేళ్ల చిన్నారికి ఓటు హక్కు ఉన్నట్టు, వయసు 35 ఏళ్లుగా ప్రచురితమైంది.

Three year old child have the right to vote but age 35 years old at karimnagar
మూడేళ్ల చిన్నారికి ఓటు హక్కు... వయస్సు 35 యేళ్లు
author img

By

Published : Jan 4, 2020, 8:02 AM IST

కరీంనగర్‌ నగరపాలక సంస్థ ఇటీవల ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో ఓ చిన్నారికి చోటు దక్కింది. నగరంలో కొత్తగా ఏర్పడిన 30వ డివిజన్‌లో మారుతీనగర్‌, పాత బజారు ప్రాంతాలను కలుపుతూ 5,007 మందిని ఓటర్లుగా ప్రకటించారు. ఆ ఓటర్ల జాబితాలోని నం.5-6-434 గల ఇంటిలో 4249 వరుస సంఖ్యతో ఓ చిన్నారి ఫొటో ప్రత్యక్షమైంది.

అది కూడా నెలల బిడ్డగా ఉన్నప్పటి చిత్రంలా ఉంది. ఆమె పేరు శ్రీ నందిత మెతుకు తండ్రి పేరు రమేశ్‌. వయసు 35 ఏళ్లుగా పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం ఆ బాలిక వయసు మూడేళ్లు. ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతోంది.

మూడేళ్ల చిన్నారికి ఓటు హక్కు.. వయసు 35 ఏళ్లు

ఇదీ చూడండి : ప్లాస్టిక్ రహిత సమాజమే ఈ అక్కాచెల్లెళ్ల లక్ష్యం!

Intro:Body:

ss

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.