తెలంగాణ

telangana

ETV Bharat / state

మధ్యవర్తిత్వం చేశారు..  ఏసీబీకి చిక్కారు

"మహానగర పాలక సంస్థ అనుమతి లేకుండా షెడ్డు నిర్మించారు... బీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారా... అధికారులు మీకు తాఖీదులు ఇచ్చారు... జీహెచ్‌ఎంసీ ప్రణాళిక విభాగం వారు 5 లక్షల రూపాయలు అడుగుతున్నారు. మీరు 2 లక్షలు ఇస్తానంటున్నారు. మధ్యే మార్గంగా 3 లక్షలు ఇవ్వండి అందరం పంచుకుంటాం... దీంతో మీకు ఎటువంటి ఇబ్బందులు రావు." ఇదీ ఏసీబీకి చిక్కిన ఇద్దరు విలేకరులు భవన యజమానితో చేసిన బేరసారాల సారంశం.

మధ్యవర్తిత్వం చేశారు..  ఏసీబీకి చిక్కారు

By

Published : Nov 17, 2019, 4:17 PM IST

మధ్యవర్తిత్వం చేశారు.. ఏసీబీకి చిక్కారు

జీహెచ్​ఎంసీ అనుమతి లేకుండా షెడ్డు నిర్మించారు. ఈ విషయంలో జీహెచ్‌ఎంసీ ప్రణాళిక విభాగం అధికారులకు లంచం ఇవ్వాలంటూ హైదరాబాద్​ జూబ్లీహిల్స్‌లోని భవన యజమాని కేశవరెడ్డితో విలేకరులు శ్రీనివాసులు, కిరణ్‌గౌడ్‌ మధ్యవర్తిత్వం నడిపించారు. ప్రణాళిక విభాగం సెక్షన్‌ అధికారి మదన్‌రాజ్‌తో వారిద్దరు కుమ్మకై ఏకంగా భవన యజమానిని 5లక్షల రూపాయలు డిమాండ్‌ చేశారు.

జీహెచ్‌ఎంసీ సిబ్బంది అని చెప్పి అక్రమంగా నిర్మించిన షెడ్డు కొలతలు తీసుకున్నారు. మూడు లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారు. డబ్బును అందరం పంచుకుంటామని చెప్పారు. అయితే ఓ హోటల్‌లో మొదట రెండు లక్షలు ఇచ్చిన కేశవరెడ్డి... లక్ష రూపాయలు మరుసటి రోజు తన ఇంటికి వచ్చి తీసుకోమని వారికి చెప్పాడు.

కిరణ్‌, శ్రీనివాసులు అతని ఇంటికి వెళ్లి డబ్బు తీసుకుంటుండగా ముందస్తు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు వారిద్దరిని పట్టుకున్నారు. లంచాలు డిమాండ్‌ చేసే ప్రభుత్వ ఉద్యోగలపై కఠిన చర్యలు తప్పవని ఏసీబీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు మధ్యవర్తిత్వం వహించే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇదీ చూడండి: "సమ్మె చట్ట విరుద్ధం.. విధుల్లో చేరినా కొనసాగింపు కష్టమే..."

ABOUT THE AUTHOR

...view details