తెలంగాణ

telangana

By

Published : May 5, 2020, 7:04 PM IST

ETV Bharat / state

జర్నలిస్టులను అన్ని రకాలుగా ఆదుకుంటాం: అల్లం నారాయణ

కరోనా మహమ్మారి బారిన పడిన జర్నలిస్టులను అన్ని రకాలుగా ఆదుకుంటామని మీడియా అకాడమీ ఛైర్మన్​ అల్లం నారాయణ హామీ ఇచ్చారు. నలుగురు జర్నలిస్టులకు కరోనా సోకగా... వారికి 20 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశామని ఆయన తెలిపారు. హోంక్వారంటైన్​లో ఉన్న మరో 9 మందికి 10 వేల చొప్పున సాయమందించామని తెలిపారు.

media academy chairman allam narayana spoke on jouralists health
జర్నలిస్టులను అన్ని రకాలుగా ఆదుకుంటాం: అల్లం నారాయణ

కరోనా బారిన పడిన జర్నలిస్టులను అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. కరోనా వైరస్ మీడియా కవరేజ్​లో కొంతమంది తెలంగాణ జర్నలిస్టులకు ఈ మహమ్మారి సోకిందని... ఈ వైరస్​ బారిన పడిన జర్నలిస్ట్​లకు మీడియా అకాడమీ తరఫున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. దిల్లీలో ముగ్గురు తెలుగు జర్నలిస్టులకు‌, గద్వాల జిల్లాలోని ఒక జర్నలిస్టుకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ఈ నలుగురికి ఇరవై వేల చొప్పున 80 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. మహబూబ్​నగర్ జిల్లాలోని ఐదుగురు, గద్వాలలోని నలుగురు జర్నలిస్టులు.. మొత్తం తొమ్మిది మంది జర్నలిస్టులు హోంక్వారంటైన్​లో ఉన్నారని... వీరందరికీ పదివేల రూపాయల చొప్పున 90 వేల రూపాయల ఆర్థిక సాయం అందించినట్లు ఆయన తెలిపారు.

ఈ మొత్తాన్ని వారి బ్యాంక్​ అకౌంట్లలో జమ చేశామని తెలిపారు. జర్నలిస్టులు సమాజహితం కోసం పనిచేయాలంటే ముందుగా ప్రాణాలతో ఉండాలన్నారు. ప్రాణం కన్నా విలువైంది ఏది లేదన్నారు. కరోనా వైరస్ విజృంభింస్తున్న నేపథ్యంలో జర్నలిస్టులు ఆరోగ్య పరమైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలని కోరారు. జర్నలిస్టులు భౌతిక దూరం పాటించాలని... వీలైనన్ని సార్లు చేతులను శుభ్రపరుచుకోవాలన్నారు. శానిటైజర్లు ఉపయోగించాలని సూచించారు. మాస్కులను ప్రతి ఒక్కరూ ధరించాలని... సమాజం కన్నా ముందు మనపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఉన్నారని... ఈ విషయాన్ని జర్నలిస్టులు గమనించాలని ఆయన సూచించారు.

ఇవీ చూడండి: 'మీడియా సిబ్బంది భద్రతపై ప్రభుత్వం ఆందోళన'

ABOUT THE AUTHOR

...view details