కరోనా వైరస్ కట్టడి దృష్ట్యా జీహెచ్ఎంసీ పరిధిలోని యాచకులను వసతి గృహాలకు తరలించి... ఉచిత భోజనాలు అందిస్తున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోని 60 మంది యాచకులను గుర్తించి... వారిని 108 వాహనాలు ద్వారా అమీర్‌పేట్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెల్టర్‌కు పంపించారు.
"రెండు రోజుల్లోనే 200 మంది యాచకులను షెల్టర్ హోంలకు తరలించి... ఉచిత భోజనాలు అందిస్తున్నాం. ఇతర సదుపాయాలు కల్పించి ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నాం. ట్యాంక్‌బండ్ ప్రాంతాల్లో 400 మంది యాచకులు ఉన్నారు. వారిని హోంలకు తరలిస్తాం. వారిని గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాము. కొందరు ప్రభుత్వం నుంచి బియ్యం, నగదు తీసుకుని... దాతలు పెట్టే భోజనానికి బయటకు వస్తున్నారు. ఇప్పుడు వారిపై దృష్టిసారించాం. ఇకపై అలా వచ్చే వారిపై కేసులు నమోదు చేస్తాం."