కాచిగూడ రైలు ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరుపుతున్నామని రైల్వే సీపీఆర్వో రాకేష్ తెలిపారు. సిగ్నల్ వ్యవస్థలో ఎలాంటి లోపం లేదని.. ఒకే సమయంలో రెండు రైళ్లు ఒకే ట్రాక్ పైకి వచ్చేలా సిగ్నల్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఎంఎంటీఎస్ లోక్ పైలెట్ సిగ్నల్ ఇవ్వకుండా ఎందుకు రైలును ముందుకు తీసుకున్నాడో దర్యాప్తులో తేలుతుందన్నారు.
లోకో పైలట్ చంద్రశేఖర్‌తోపాటు మరో 12 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయని సీపీఆర్వో తెలిపారు. బాధితుల వివరాల కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్-040-27700868, కాచిగూడలో 040-27568624 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని చెప్పారు.