తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు బీజేపీ అభ్యర్థి ప్రకటన - Upadhyaya MLC BJP Candidate

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు బీజేపీ అభ్యర్థి ప్రకటన
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు బీజేపీ అభ్యర్థి ప్రకటన

By

Published : Feb 14, 2023, 12:03 PM IST

Updated : Feb 14, 2023, 12:38 PM IST

11:57 February 14

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు బీజేపీ అభ్యర్థి ప్రకటన

Upadhyaya MLC BJP Candidate: రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ అభ్యర్థిగా వెంకట నారాయణరెడ్డిని బరిలో దింపింది. రాష్ట్ర శాసన మండలిలో త్వరలో ఖాళీ కానున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

అందులో ఒకటి.. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి ఎన్నికైన కాటేపల్లి జనార్దన్‌రెడ్డి పదవీకాలం ఈ ఏడాది మార్చి 29న, రెండోది.. హైదరాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సయ్యద్‌ అమీనుల్‌ హస్సన్‌ జాఫ్రీ పదవీకాలం మే ఒకటో తేదీన ముగియనుంది. ఈ స్థానాలకు మార్చి 13న ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించింది.

హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాను సైతం అధికారులు ఇప్పటికే విడుదల చేశారు. షాద్‌నగర్‌, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్‌, కందుకూరు డివిజన్లలో కలిపి 8,686 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో మహిళలు 4,095 మంది, పురుషులు 4,590 మంది, ఒకరు ట్రాన్స్‌జెండర్‌ ఉన్నారు.

కొత్తగా ఓటు హక్కుకు 1,131 దరఖాస్తులు..: మరోవైపు మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ శాసనమండలి ఉపాధ్యాయుల నియోజకవర్గంలో ఓటు నమోదు గడువు ముగిసిందని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ సోమవారం తెలిపారు. కొత్తగా ఓటు నమోదుకు 1,131 దరఖాస్తులు అందాయని వెల్లడించారు. డిసెంబరులో ప్రకటించిన ఓటర్ల జాబితాలో ఈ నియోజకవర్గంలో 29,501 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. తుది ఓటర్ల జాబితాను ఈ నెల 23న ప్రకటిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ల దాఖలుకు ఈ నెల 23వ తేదీ తుది గడువుగా కేంద్ర ఎన్నికల సంఘం గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.

'నామినేషన్ల దాఖలు తుది గడువుకు పది రోజుల ముందు వరకు ఓటు హక్కు కోసం నమోదుకు అవకాశం ఉంది. ఆ గడువు సోమవారంతో ముగిసింది. ప్రస్తుతం వచ్చిన దరఖాస్తుల్లో అర్హులైన ఓటర్ల వివరాలను తుది జాబితాలో చేరుస్తాం. సర్వీస్‌ సర్టిఫికెట్‌ విషయంలో గతంలో తిరస్కరించిన 1,440 ఓటరు దరఖాస్తులను కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు మరో దఫా పరిశీలించాం. వాటిలో 788 అర్హమైనవిగా గుర్తించాం. తుది ఓటర్ల జాబితాలో వీటినీ నమోదు చేస్తాం. సాధారణ ఎన్నికల్లో ఉన్నట్లు మండలి ఎన్నికల్లో నోటా గుర్తు ఉండదు' అని వికాస్‌రాజ్‌ తెలిపారు.

హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటాలో..హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటాలో 127 మంది ఓటర్లు ఉన్నారని వికాస్‌రాజ్‌ వెల్లడించారు. హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని కార్పొరేటర్లు, కంటోన్మెంట్‌ సభ్యులు, ఇద్దరు లోక్‌సభ సభ్యులు, 15 మంది ఎమ్మెల్యేలు, ఎక్స్‌అఫీషియో సభ్యులుగా గ్రేటర్‌ హైదరాబాద్‌ను ఎంచుకున్న రాజ్యసభ, శాసనమండలి సభ్యులతో కలిపి 127 మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు.

ఇవీ చూడండి..

రెండు ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 13న ఎన్నికలు

అధిక జనాభా వరమా.. భారమా? భవిష్యత్ కోసం ఎలా సన్నద్ధమవ్వాలి?

Last Updated : Feb 14, 2023, 12:38 PM IST

ABOUT THE AUTHOR

...view details