మున్సిపల్ ఎన్నికల వేళ రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. జనవరి 1 నుంచి 20 వరకు సుమారు రూ.1,500 కోట్లు విలువైన 21.90 లక్షల కేసుల లిక్కర్, 20.80 లక్షల కేసుల బీరు అమ్ముడుపోయాయి. 2019 జనవరి ఒకటి నుంచి 20 వరకు రూ.1,120 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరగగా.. పురపాలక ఎన్నికల కారణంగా ఈ ఏడాది సుమారు రూ.1,500 కోట్లు విలువైన మద్యాన్ని మందుబాబులు తాగేశారు. గతేడాదితో పోల్చితే కేవలం 20 రోజల్లో సుమారు రూ.350 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు అధికంగా జరిగాయి.
రంగారెడ్డిలో రూ.323 కోట్లు, హైదరాబాద్‌లో రూ.147 కోట్లు, నల్గొండలో రూ.170 కోట్లు, మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.110 కోట్లు, మెదక్‌లో రూ.121 కోట్లు, వరంగల్ అర్బన్ జిల్లాలో రూ.140 కోట్లు , కరీంనగర్‌లో రూ.130 కోట్లు, ఆదిలాబాద్ జిల్లాలో రూ.82 కోట్లు చొప్పున మద్యం విక్రయాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి.