ETV Bharat / state

పుర పోరుపై... పోలీసుల నిఘా! - పురు పోరుపై... పోలీసుల నిఘా!

పుర, నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కసరత్తు చేస్తున్నారు. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు డేగ కన్ను వేశారు. శాంతిభద్రతల పర్యవేక్షణే లక్ష్యంగా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు  సూచించారు.

bondobastu-of-police-for-municipal-elections-in-hyderabad
పుర పోరుపై... పోలీసుల నిఘా!
author img

By

Published : Jan 20, 2020, 11:58 PM IST

Updated : Jan 21, 2020, 12:24 AM IST

పుర పోరు ప్రచారం ఇవాళ్టితో సమాప్తం అయ్యింది. సాయంత్రం 5 గంటలతో ప్రచార గడువు ముగిసింది. 9 నగరపాలక సంస్థలు, 120 పురపాలక సంఘాల్లో బుధవారం పోలింగ్ జరగనుంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2 కార్పోరేషన్లు, 12 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి.

పుర పోరుపై... పోలీసుల నిఘా!పురు పోరుపై... పోలీసుల నిఘా!

భారీ బందోబస్తు ఏర్పాటు...

పోలీసులతో పాటు అదనపు బలగాలతో బందోబస్తు ప్రణాళిక రూపొందిస్తున్నారు. మొత్తం 726 పోలింగ్ కేంద్రాల్లో 197 సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. ఇందు కోసం 4500 మంది ట్రాఫిక్, సివిల్, ఆర్మ్​డ్ బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 380 మంది తమ ఆయుధాలను సమర్పించారు. 208 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు మహేష్ భగవత్ తెలిపారు.

ప్రత్యేక ప్లైయింగ్ టీంల ఏర్పాటు

ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదు, మద్యం సరఫరాను అరికట్టేందకు ప్రత్యేక ప్లైయింగ్ టీంలు రంగంలోకి దింపారు. మరోవైపు రాచకొండ పోలీసులు కూడా కమిషరేట్ పరిధిలో మల్కాజిగిరి, ఎల్బీనగర్, భువనగిరి జోన్లలో పోలింగ్ కేంద్రాలు ఉన్నందున వాటి బందోబస్తుకు సర్వం సిద్ధం చేశారు. ఎటువంటి అంఛనీయ ఘటనలు జరగకుండా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పోలీసు అధికారులతో చర్చించారు.

ఇదీ చూడండి: భాజపా జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా

TG_HYD_44_20_MUNCIPAL_POLICE_BANDOBASTH_PKG REPORTER: NAGARJUNA note: కొన్ని జనరల్ షాట్స్ వాడుకోగలరు ( )పురపాలక ఎన్నికలకు పోలీసులు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాల బందోబస్తు కు కసరత్తు చేస్తున్నారు. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పలు అధికారులతో చర్చించారు. ఇందు కోసం ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, రిజర్వ్ బలగాల తో పోలీసులు ఉన్నతాధికారులు బందోబస్తు ప్రణాళికలు సిద్దం చేశారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు సూచించారు. వాయిస్ పురపాలక ఎన్నికలకు మరో రెండు రోజుల్లో ఉన్నందున ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులు ఆయా ప్రాతాంల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. పోలీసులతో పాటు అదనపు బలగాలతో బందోబస్తు ప్రణాళిక రూపొందిస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2 కార్పోరేషన్లు, 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు ఉన్నాయి. మొత్తం 726 పోలింగ్ కేంద్రాల్లో 197 సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. ఇందు కోసం 4500 మంది ట్రాఫిక్, సివిల్, ఆర్మ్ డ్ బలగాలతో భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 380 మంది తమ ఆయుధాలను సమర్పించారు. 208 మందిపై బైండోవర్ కేసులు నమొదు చేసినట్లు తెలిపారు. అంతే కాకుండా ఓటర్లను ప్రలోబ పెట్టేందుకు నగదు, మద్యం సరఫరాను ఆరికట్టేందకు ప్రత్యేక ప్లైయింగ్ టీంలు రంగంలోకి దింపారు.మరోవైపు రాచకొండ పోలీసులు కూడా కమిషరేట్ పరిధిలో మల్కాజిగిరి, ఎల్బినగర్, భువనగిరి జోన్లలో పోలింగ్ కేద్రాలు ఉన్నందున వాటి బందోబస్తుకు సర్వం సిద్దం చేశారు. ఎటువంటి అంఛనీయ ఘటనలు జరగకుండా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పోలీసు అధికారులతో చర్చించారు. ఎన్నికల ప్రచారం ముగియడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి చేసే కార్యక్రమాలు పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్నకల నిభంధనల ప్రకారం ఆయుధాలను పోలీసులకు హ్యాండోవర్ చేయాలని సూచించారు.
Last Updated : Jan 21, 2020, 12:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.