ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం ధరలు మరోసారి భారీగా పెంచింది. ఇప్పుడున్న రేట్లపై మరో 50 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నిన్నటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సర్కారు మద్యం ధరలను పెంచింది. నేటి నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నాయి.
మందుబాబులకు భారీ షాకిచ్చిన ఏపీ సర్కారు
మందుబాబులకు ఏపీ ప్రభుత్వం మరో ఊహించని షాకిచ్చింది. ఇప్పటికే 25 శాతం ధరలు పెంచిన ప్రభుత్వం.. తాజాగా మరో 50 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో మద్యం ధరలు
ఇటీవల పెంచిన 25 శాతానికి తాజాగా పెంచిన 50 శాతం కలిపి.. మెుత్తంగా 75 శాతం మద్యం రేట్లను ప్రభుత్వం పెంచింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు దుకాణాలు తెరవవద్దని ఏపీఎస్‌బీసీఎల్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలాఖరులోగా మరో 15 శాతం మద్యం దుకాణాలు తగ్గించాలని నిర్ణయం తీసుకుంది.
ఇదీ చూడండి:వాహనదారులకు షాక్- భారీగా పెరిగిన పెట్రో ధరలు