KTR Tweet on Central Government Jobs : కేంద్రంపై మంత్రి కేటీఆర్ మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు కొత్త శిఖరాన్ని చేరుకుంటున్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2004 నాటికి కేంద్ర ప్రభుత్వ ఖాళీలు 12.1 శాతం ఉండగా.. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ముగిసే సమయానికి దాదాపు 11 శాతానికి చేరుకుందని చెప్పారు. కానీ.. మోదీ హయాంలో ఆ సంఖ్య దాదాపు 25 శాతానికి చేరుకుందని కేటీఆర్ ట్వీట్ చేశారు.
'కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు కొత్త శిఖరాన్ని చేరుకుంటున్నాయి. 2004 నాటికి కేంద్రంలో ఖాళీలు 12.1 శాతం ఉండగా.. అప్పటి ప్రధాని మన్మోహన్ ప్రభుత్వం ముగిసే సమయానికి దాదాపు 11 శాతానికి చేరుకుంది. తిరిగి మోదీ హయాంలో ఆ సంఖ్య దాదాపు 25 శాతానికి చేరుకుంది.' - ట్విటర్లో కేటీఆర్
KTR Tweet Today : 'కుమురంభీం కల సాకారమైన వేళ.. గిరిజనులకు పట్టాలతో పట్టాభిషేకం చేస్తున్న తరుణమిది'
KTR Tweet on Telangana Mobility Valley : మరోవైపు తెలంగాణ మొబిలిటీ వ్యాలీ.. ఆటోమోటివ్ రంగంలో అధునాతన వృత్తిని అభ్యసిస్తున్న విద్యార్థులకు ఎన్నో అవకాశాలను సృష్టిస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఎమ్‌వీలో హ్యుందాయ్ మొబిస్, బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ కలిసి.. సరికొత్త 11 నెలల పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ఎలక్ట్రిఫికేషన్, అటానమస్ డ్రైవింగ్, కనెక్టెడ్ వెహికల్, కృత్రిమ మేధా, మెషీన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సును ప్రవేశ పెట్టినట్లు వివరించారు. హైదరాబాద్ బిట్స్ పిలానీలో ఈ కోర్సు పూర్తి చేసిన వారికి హ్యుందాయ్ మొబిస్‌లో లైవ్ ప్రాజెక్టులపై పనిచేసే అవకాశం దొరుకుతుందని కేటీఆర్ వెల్లడించారు.