తెలంగాణ

telangana

ETV Bharat / state

కన్నులపండువగా పతంగుల పండుగ - Kite_Festiaval

సికింద్రాబాద్​ పరేడ్​ మైదానంలో వివిధ దేశాల పతంగులు కనువిందు చేస్తున్నాయి. అంతర్జాతీయ పతంగుల పండుగను వీక్షించేందుకు నగరవాసులు తండోపాతండాలుగా తరలివస్తున్నారు. పతంగులతో పాటు మిఠాయిల రుచిని ఆస్వాదిస్తున్నారు.

Kite_Festiaval in hyderabad
కన్నులపండువగా పతంగుల పండుగ

By

Published : Jan 14, 2020, 5:50 PM IST

సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అంతర్జాతీయ పతంగుల పండుగ రెండో రోజు ఉత్సాహంగా సాగుతోంది. వివిధ దేశాలకు చెందిన విభిన్న ఆకృతుల్లో పతంగులను చూసి నగర వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 20 దేశాలకు చెందిన కైట్ ప్లేయర్స్​తో పాటు దేశంలోని పలు రాష్ట్రాల కైట్ క్లబ్ ప్రతినిధులు ఈ పతంగుల పండుగలో పాల్గొన్నారు.

దీనితో పాటు స్వీట్ ఫెస్టివల్ కూడా నగర వాసులను ఆకట్టుకుంటోంది. ఎక్కడా లేని విధంగా అన్ని దేశాల స్వీట్లు రుచి చూస్తూ కుటుంబంతో కలిసి పరేడ్ మైదానంలో సేదతీరుతున్నారు.

కన్నులపండువగా పతంగుల పండుగ

ఇవీ చూడండి: పతంగుల పండుగ: కైట్ ఫెస్టివల్​లో కేంద్ర మంత్రి..

ABOUT THE AUTHOR

...view details