హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్ ప్లాజాలో భాజపా యువ మోర్చా ఆధ్వర్యంలో పతంగుల పండుగ నిర్వహించారు. కేంద్ర మంత్రి ఫగన్ సింగ్ కులాస్తే, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచందర్ రావు, మోతుక్కుపల్లి నర్సింహులు ఈ పండుగకు హాజరై పతంగులు ఎగుర వేశారు.
పౌరసత్వ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి ఫగన్ సింగ్ కులాస్తే అన్నారు. ముఖ్యంగా దేశంలో ఉన్న మైనార్టీలకు ఈ చట్టం వల్ల ఇబ్బంది లేదన్నారు. అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుంచి వలస వచ్చి ఇక్కడ ఉండే వారిని గుర్తించెందుకే ఈ చట్టాలని తెలిపారు.
మోదీ, అమిత్ షాల నిర్ణయాలకు సంఘీభావంగానే ఈ పండుగ నిర్వహిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. మతాల మధ్య చిచ్చు పెడుతూ... కొన్ని రాజకీయ పార్టీలు దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. మజ్లీస్ పార్టీ కుట్రలు చేస్తుంటే... తెరాస మద్దతు పలకడం దారుణమన్నారు.
ఇవీ చూడండి: తెరాస బీ ఫారం దక్కలేదని అభ్యర్థి ఆత్మహత్యాయత్నం