హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఎస్‌బీలో ఏర్పాటు చేసిన ఐడీయాస్ ఫర్ ఇండియా-2020 ఐఎస్‌బీ పాలసీ కన్‌క్లెవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర హెం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రారంభించారు. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో భారత్ దూసుకెళ్తోందని తెలిపారు. నేటి యువతరం కొత్త ఒరవడులకు నాంది పలకాలన్నారు.
దేశం సామాజికంగా, అర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చెందాలనే విషయంలో ఐడీయాస్ కన్క్లేవ్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గడిచిన ఆరేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ అనేక గొప్ప నిర్ణయాలు తీసుకున్నారని వివరించారు. నోట్ల రద్దు, ఆర్టికల్ 370 రద్దు, జీఎస్టీ వంటి సాహోసోపేత నిర్ణయాలతోపాటు జన్‌ధన్ యోజన వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారని కిషన్ రెడ్డి తెలిపారు.