Kishan Reddy Fires On CM KCR : బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంఛార్జిల సమావేశం ప్రారంభమైంది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్రెడ్డి(Kishan Reddy) అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి సునిల్ బన్సల్, ప్రకాశ్ జవడేకర్, డీకే అరుణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంఛార్జిలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు పాల్గొన్నారు.
Telangana BJP State Office Bearers Meeting : మేరీ మాటీ-మేరా దేశ్ కార్యక్రమ(BJP Meri Mati Mera Desh Program) యోజన, ఎమ్మెల్యే ప్రవాస్ యోజన అసెంబ్లీ వారీగా ఏ విధంగా జరిగిందనే దానిపై నేతలు సమీక్షిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నిర్వహించిన సమ్మేళనాలపై సమీక్ష నిర్వహించాల్సిన వాటిపై చర్చిస్తున్నారు. జిల్లా, అసెంబ్లీ వారీగా సంస్థాగత పరిశీలకుల పర్యటనకు చేయవలసిన ఏర్పాట్లు.. అలాగే అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections 2023) తయారీపై సమీక్ష చేస్తున్నారు. త్వరలో జరిగే పార్టీ యాత్రల ఏర్పాట్లపైన అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారు.
Amit Shah Telangana Tour : సెప్టెంబర్ 17న తెలంగాణకు అమిత్ షా
Kishan Reddy Comments On CM KCR : మోదీ జన్మదినమైన సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు 15 రోజుల సేవాపక్షం సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై, ఆయుష్మాన్ భారత్ కార్డు జారీపై దిశానిర్దేశం చేస్తున్నారు. సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 18 కులవృత్తి వారికి లబ్ధి చేకూర్చే పథకం గురించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం(Telangana Liberation Day) సందర్భంగా చేయాల్సిన కార్యక్రమాలు, తెలంగాణ విమోచన దినోత్సవంకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) వస్తున్న నేపథ్యంలో పర్యటన విజయవంతంపై మార్గ నిర్దేశనం చేస్తున్నారు.
kishan Reddy Comments on BRS : 'వంట గ్యాస్, పెట్రో రేట్లపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదు'