20 సంవత్సరాలుగా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న హుజూర్నగర్ తెరాస సొంతం కావడంపై గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ కూతురు మాజీ ఎంపీ కవిత ట్విట్టర్లో ఆనందాన్ని పంచుకున్నారు. సీఎం కేసీఆర్ పైన అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శించి... కారు పార్టీకి అపూర్వమైన విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇక ఈ విజయం కోసం నిరంతరం శ్రమించిన తెరాస కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు అని మాజీ ఎంపీ కవిత ట్వీట్ చేశారు.
తెరాస అఖండ విజయంపై స్పందించిన కవిత - EX MP Kavitha responding on Huzurnagar by elections
హుజూర్నగర్ ఉప ఎన్నికలో తెరాస పార్టీ అఖండ విజయాన్ని చేజిక్కించుకోవటం వల్ల పార్టీ శ్రేణులు ఆనంద ఉత్సవాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ కవిత ట్వీట్టర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు.

తెరాస అఖండ విజయంపై స్పందించిన కేసీఆర్ తనయ
TAGGED:
Huzurnagar by elections