సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో కార్తీకమాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయంలో శ్రీ వీరభద్ర సహిత మహా కాళేశ్వర ఉప ఆలయంతోపాటు ప్రధానాలయంలోనూ పూజలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చే అమ్మవారిని భక్తులు పెద్దఎత్తున దర్శించుకున్నారు. సామూహిక పారాయణం, భజనలు భక్తుల రద్దీతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ పూర్తి ఏర్పాట్లు చేసింది.
సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో కార్తీకమాస పూజలు - సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో కార్తీకమాస పూజలు
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
![సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో కార్తీకమాస పూజలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5022652-thumbnail-3x2-temple.jpg)
ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయం
ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయం
ఇవీ చూడండి : యాదాద్రీశుడి సన్నిధికి పోటెత్తిన భక్తులు