కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అన్లాక్ 4 మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్ నెలాఖరు వరకు పాఠశాలలు ప్రారంభించడానికి అనుమతి లేదని.. ఈనెల 21 తర్వాత ప్రతిరోజు 50 శాతం ఉపాధ్యాయులు మాత్రమే పాఠశాలలకు హాజరయ్యేలా అనుమతించాలని జాక్టో డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదేశాలివ్వాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని జాక్టో, యూయూస్పీసీ ప్రతినిధులు కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.
సెప్టెంబరు 1 నుంచి ఆన్లైన్ తరగతులు మొదలయ్యాయని.. ఇకపై ఉపాధ్యాయులు ఇంటివద్దనుంచైనా విద్యార్థులను పర్యవేక్షణ చేయగలుగుతారని జాక్టో ప్రతినిధులు మంత్రితో చెప్పారు. ఈ వారం రోజుల్లోనే పాఠశాలలకు హాజరైన పలువురు ఉపాధ్యాయులకు కరోనా సోకిందని ఇతర ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారన్నారు. అందువల్ల జీవో 120లోని నిబంధనలను అమలు చేయాలని మంత్రికి విన్నవించారు.