తెలంగాణ

telangana

ETV Bharat / state

'రానున్నాయ్​ పెట్టుబడులు... వాటితో పాటు ఉద్యోగాలు'

రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా... పెట్టుబడులు వచ్చేలా చూడాలని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ అధికారులను ఆదేశించారు. గత ఐదేళ్లలో ఐటీలో అద్భుత పురోగతిని సాధించామన్న ఆయన రాబోయే  రోజుల్లో మరిన్ని ఐటీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. రానున్న నాలుగేళ్లలో విభాగాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలతో కూడిన నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​

By

Published : Sep 13, 2019, 6:14 PM IST

Updated : Sep 13, 2019, 6:47 PM IST

'రానున్నాయ్​ పెట్టుబడులు... వాటితో పాటు ఉద్యోగాలు'
రాష్ట్రంలో పుడ్ ప్రాసెసింగ్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్, ఐటీ రంగాల్లో రానున్న కొన్ని నెలల్లోనే భారీగా పెట్టుబడులు రానున్నాయని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే పలు కంపెనీలు టీఎస్ ఐపాస్ ద్వారా అనుమతులు తీసుకున్నాయని... అక్టోబర్​లో శంకుస్థాపన జరుగుతాయని చెప్పారు. పెట్టుబడుల పురోగతిపై పరిశ్రమలు, ఐటీ శాఖ విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న సంస్థలకు పూర్తి సహకారం అందించాలని కేటీఆర్​ ఆదేశించారు.

ఉద్యోగాల కల్పనే లక్ష్యం

రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుబడులు వచ్చేలా చూడాలని కేటీఆర్​ అధికారులకు స్పష్టం చేశారు. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో చేపట్టిన పారిశ్రామిక, ఫుడ్​ ప్రాసెసింగ్​ పార్కుల పురోగతిని కూడా మంత్రి సమీక్షించారు. మౌలిక సదుపాయాల కల్పన పూర్తైన పార్కుల్లో మరిన్ని కంపెనీలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గత ఐదేళ్లుగా ఐటీ రంగంలో అద్భుత ప్రగతి సాధించామని పేర్కొన్నారు. రానున్న నాలుగేళ్లలో విభాగాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలతో కూడిన నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చూడండి : రక్షణ శాఖ ఎస్టేట్స్​ డీజీకి కేసీఆర్​ లేఖ... ఎందుకంటే...?

Last Updated : Sep 13, 2019, 6:47 PM IST

ABOUT THE AUTHOR

...view details