తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో ఈ నెల 11 నుంచి ఇంటర్‌ పరీక్షల మూల్యాంకనం - మంత్రి ఆదిమూలపు సురేశ్ వార్తలు

ఆంధ్రప్రదేశ్​లో ఈ నెల 11 నుంచి ఇంటర్​ జవాబు పత్రాల మూల్యాంకనం చేయనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్​ తెలిపారు. సచివాలయంలో ఇంటర్​బోర్డు అధికారులతో దృశ్యమాధ్యమ సమీక్షను మంత్రి నిర్వహించారు.

ఏపీ విద్యా శాఖ మంత్రి సురేశ్​
ఏపీ విద్యా శాఖ మంత్రి సురేశ్​

By

Published : May 7, 2020, 9:36 PM IST

ఆంధ్రప్రదేశ్​లో మే 11 నుంచి ఇంటర్‌ పరీక్షల మూల్యాంకనం ప్రక్రియ ప్రారంభించాలని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్​ అధికారులను ఆదేశించారు. సచివాలయం నుంచి ఇంటర్‌ విద్యకు సంబంధించిన బోర్డు అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తొలుత గ్రీన్, ఆరెంజ్‌ జోన్​లలో మూల్యాంకనం చేయనున్నట్లు తెలిపారు. లాక్​డౌన్ ముగిసిన అనంతరం రెడ్ జోన్‌లో జరుగుతుందన్నారు.

కొవిడ్- 19 జాగ్రత్తలను పాటిస్తూనే మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి అన్నారు. రోజూ రెండు షిఫ్ట్‌ల్లో ఈ ప్రక్రియ సాగుతుందన్నారు. ఇప్పటికే పలు పోటీ పరీక్షలకు సంబంధించిన తేదీలు ఖరారు కావటంతో త్వరితగతిన ఇంటర్‌ మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలను వెల్లడించాల్సి ఉందన్నారు. జూన్ చివరి నాటికి ఇంటర్‌ బోర్డు వెబ్​సైట్​లో విద్యార్థులకు థియరీ క్లాసులు, అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వీడియో పాఠాలు, ప్రాక్టికల్స్​కు సంబంధించిన వీడియోలు పొందుపరచనున్నట్లు మంత్రి తెలిపారు.

ఇవీ చూడండి:రైతు రుణమాఫీకి రూ1200 కోట్లు విడుదల

ABOUT THE AUTHOR

...view details