హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద పౌరసత్వ బిల్లుపై రేపు అవగాహన సభ నిర్వహించనున్నట్లు భాజపా ఎమ్మెల్సీ రామచంద్రరావు వెల్లడించారు. ఈ సభ ద్వారా ప్రజలకు పౌరసత్వ బిల్లుపై అవగాహన కల్పిస్తామని అయన పేర్కొన్నారు. నాంపల్లిలోని రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం పూర్తి వివరాలను ఎమ్మెల్సీ వివరించారు. సభకు అనుమతి ఇవ్వకున్నా... నిర్వహించి తీరతామని రామచందర్ రావు స్పష్టం చేశారు.
సభకు కేంద్ర మంత్రులు...
ఇందిరాపార్కు వద్ద జరిగే సభకు కేంద్ర మంత్రులు, ముఖ్య నాయకులు హాజరుకానున్నారని తెలిపారు. పురపాలక ఎన్నికల కోసం అన్ని మున్సిపాలిటీల్లో ఇంఛార్జీలను నియమించామన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్... ప్రభుత్వ ఒత్తిడి మీద పనిచేస్తున్నట్లు కనిపిస్తోందని ఆక్షేపించారు. రిజర్వేషన్లను రాజకీయ కుట్రతో చేయడం సరికాదని హితవు పలికారు. భాజపా వల్లే మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. తెరాస సౌలభ్యంతో మజ్లిస్ ర్యాలీలు, నిరసనలు చేస్తున్నాయని వివరించారు.
'రేపటి అవగాహన ర్యాలీకి కేంద్ర మంత్రులు' ఇవీ చూడండి : రేపు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన