తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐసెట్​ మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తి

రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ మొదటి విడత కౌన్సెలింగ్ సీట్లను కేటాయించారు. ఈ ఏడాది ఐసెట్​లో 41 వేల 512 మంది అర్హత సాధించగా...16 వేల 798 మంది విద్యార్థులు మాత్రమే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు.

Icet  first councilling allocation of seats in the state has been completed
ఐసెట్​ మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తి

By

Published : Dec 15, 2020, 10:23 PM IST

ఐసెట్​ కౌన్సెలింగ్​ మొదట విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. ఎంబీఏ కోర్సులో 22,267 సీట్లు ఉండగా..13,721 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. రాష్ట్రంలోని 19 ప్రభుత్వ కళాశాలల్లో 1270 సీట్లలో 1185 సీట్లు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా 245 ప్రైవేట్ కళాశాలల్లో 20,997 సీట్లకు గాను 12,536 భర్తీ అయ్యాయి.

ఎంసీఏలో 1869 సీట్లు ఉండగా 1847 సీట్లను కేటాయించారు. ప్రభుత్వ సీట్లు అన్ని భర్తీ అయ్యాయి. మొదటి విడతలో సీటు పొందిన అభ్యర్థులు ఈనెల 19లోగా ఆన్​లైన్​లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ప్రవేశాల కమిటీ కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు.

ఇదీ చూడండి:ఎల్‌ఆర్‌ఎస్‌ గుదిబండలా మారింది: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ABOUT THE AUTHOR

...view details