పలువురు ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. అటవీశాఖ ముఖ్యకార్యదర్శిగా నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్, కార్మిక శాఖ కార్యదర్శిగా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి అహ్మద్ నదీం, పర్యాటక శాఖ కార్యదర్శిగా పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ సోమేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
పలువురు ఐఏఎస్లకు అదనపు బాధ్యతలు - IAS OFFICERS EXTRA DUTIES in Telangana State
పలువురు ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
పలువురు ఐఏఎస్లకు అదనపు బాధ్యతలు
అటవీ, పర్యాటక శాఖల కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల ఈ మేరకు అదనపు బాధ్యతలు అప్పగించారు. శశాంక్ గోయల్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా నియామకం కావటం వల్ల ఆయన స్థానంలో అహ్మద్ నదీంకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఇవీ చూడండి: పోరు దిశగా కాంగ్రెస్... నిలువరించే పనిలో తెరాస