కార్మికులకు న్యాయం జరగాలంటే ఏఐటీయూసీ ద్వారానే సాధ్యమవుతుందని రాష్ట్ర కార్యదర్శి నరసింహ స్పష్టం చేశారు. ఈ నెల 24న జరగనున్న మెట్రో వాటర్ వర్క్స్ గుర్తింపు ఎన్నికల్లో హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ వర్క్స్ యూనియన్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ పద్మారావు నగర్లోని జలమండలి కార్మికుల సమావేశాన్నికి ఆయన ముఖఅతిథిగా హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో సత్యనారాయణను అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని కార్మికులను కోరారు. జల మండలి సిబ్బందికి హెల్త్ కార్డులు కొత్త రిక్రూట్మెంట్, ఇళ్ల స్థలాలను కార్మికులకు ఇప్పించేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు
కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం: ఏఐటీయూసీ - AITUC
ఈ నెల 24న హైదరాబాద్లో జలమండలి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ వర్క్స్ యూనియన్ను గెలిపించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ విజ్ఞప్తి చేశారు.
కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం: ఏఐటీయూసీ