కరోనా నేపథ్యంలో రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్న కానిస్టేబుళ్లలో హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు. రాత్రి పలు కూడళ్లలో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుళ్లతో ఆయన ముచ్చటించారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వారందరికీ బిస్కెట్లు అందించారు. పోలీసు విధులు అంటేనే చాలా బాధ్యతగలవని...కుటుంబానికి ఇవ్వాల్సిన ఎంతో విలువైన సమయాన్ని ప్రజల కోసం కేటాయిస్తున్నారని సీపీ అంజనీకుమార్ తెలిపారు. బయట నిరంతరం కష్టపడుతున్న పోలీసులకు...ప్రజలు ఇళ్లలోనే ఉండి సహకరిస్తే సమష్టిగా కరోనాను ఓడించగలమంటున్న సీపీ అంజనీకుమార్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
కానిస్టేబుళ్లు, వారి కుటుంబాలకు సెల్యూట్ చేస్తున్నా: సీపీ - hyderabad
కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న తరుణంలో కష్టపడి పనిచేస్తున్న కానిస్టేబుళ్లలో హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ నూతనోత్సహాన్ని నింపుతున్నారు. ఎన్నో త్యాగాలు చేసి కానిస్టేబుళ్లు కష్టపడుతున్నారని... ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రాకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
కానిస్టేబుళ్లు, వారి కుటుంబాలకు సెల్యూట్ చేస్తున్నా: సీపీ