హైదరాబాద్ పాతబస్తీలో ఈ రోజు మధ్యాహ్నం ఉద్రిక్తత చేటుచేసుకుంది. మక్కా మసీదు వద్ద ఇవాళ మధ్యాహ్నం సమయంలో ప్రార్థనలు పూర్తయిన అనంతరం గుమిగూడిన నిరసనకారులు కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితిని గమనించిన పోలీసులు రంగంలోకి దిగి భారీ భద్రత ఏర్పాటు చేశారు.
ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తోపులాట
ఒక దశలో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ముందు జాగ్రత్తగా కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించారు. ఉన్నతాధికారులునిరసనకారులకు సర్దిచెప్పడం వల్ల ఆందోళన విరమించారు. ప్రస్తుతం చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పోలీసు భద్రత కొనసాగుతోంది.
పాతబస్తీలో భారీ పోలీస్ బందోబస్తు ఇవీ చూడండి: భాగ్యనగరానికి రాష్ట్రపతి కోవింద్.. ఘన స్వాగతం