తెలంగాణ

telangana

By

Published : Jul 15, 2021, 7:31 PM IST

Updated : Jul 15, 2021, 10:18 PM IST

ETV Bharat / state

kokapet lands : కోట్లలో పలికిన కోకాపేట భూములు

కోకాపేటలో రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న భూములు రూ.వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. 49.92 ఎకరాలను ఎంఎస్‌టీసీ వెబ్‌సైట్‌ ద్వారా హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఇవాళ వేలం నిర్వహించగా భారీ ధర పలికినట్టు తెలుస్తోంది. ఒక్కో ఎకరం గరిష్టంగా రూ. 60 కోట్లా 20 లక్షల ధర పలికింది.

kokapet
kokapet

కోకాపేట భూములు రాష్ట్ర ప్రభుత్వానికి కనకవర్షం కురిపించాయి. హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన నియోపోలిస్ లేఅవుట్ లోని భూములు రికార్డు ధర పలికాయి. గరిష్టంగా ఎకరానికి ఏకంగా 60 కోట్లా 20 లక్షల రూపాయల ధర పలికింది. 1.65 ఎకరాల విస్తీర్ణం ఉన్న భూమిని రాజపుష్ప రియాల్టీ సంస్థ ఎకరం 60.2 కోట్ల చొప్పున 99.33 కోట్లకు దక్కించుకొంది. సగటున ఎకరం 40.05 కోట్ల ధరను కోకాపేట భూములు పలికాయి. మొత్తం 49.949 ఎకరాల అమ్మకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 2,000.37 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చింది. భూముల అమ్మకం కోసం హెచ్ఎండీఏ ఇవాళ ఈ-వేలం నిర్వహించింది.

కోకాపేటలోని భూములను వేలం వేయడానికి ప్రభుత్వం ఏడాది కిందట నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే 49.92 ఎకరాలను అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వెంచర్‌గా మార్చే పనిని హెచ్‌ఎండీఏ భుజానికెత్తుకుంది. ఈ మొత్తం భూమిని ఎనిమిది ప్లాట్లుగా విభజించింది. ఒక్కో ఎకరం కనీసం ధర రూ.25 కోట్లుగా నిర్ధారించింది. దీనికి అనుగుణంగా ఈ-వేలం నిర్వహించింది. ఈ వెంచర్‌కు నియోపొలిస్‌ పేరు పెట్టింది. అవుటర్‌ పక్కనే ఈ వెంచర్‌ ఉంది. ప్రస్తుతం ఈ వెంచర్‌లోకి అవుటర్‌ నుంచి నేరుగా రావడానికి వీలులేదు. ఫైనాన్షియల్‌ జిల్లా నుంచి కోకాపేటకు రావాలంటే ఇంటర్‌ ఛేంజ్‌లో ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు ప్రత్యేకంగా ట్రంపెట్‌ నిర్మిస్తున్నారు. దీనివల్ల ఎయిర్‌పోర్టు వైపు నుంచి అవుటర్‌ మీదుగా నేరుగా నియోపోలిస్‌ లేఅవుట్‌లోకి రావచ్చు. దీనికి రూ.82 కోట్లను వ్యయం చేస్తున్నారు. దీంతో ఈ నియోపోలిస్‌కు పెద్దఎత్తున డిమాండ్‌ ఏర్పడింది.

అందరి దృష్టి అటువైపే!

గతంలో కోకాపేట చుట్టుపక్కల వేలం వేసినప్పుడు ఎకరా రూ.40 కోట్ల ధర పలికింది. ఈ నియోపోలిస్‌ వెంచర్‌ ఏర్పాట్లన్నింటిని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ దగ్గరుండి పర్యవేక్షించారు. వెంచర్‌ లోపల వంద అడుగుల రోడ్లను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఖానామెట్‌లోని 15.01 ఎకరాలను రేపు వేలం వేయడానికి టీఎస్‌ఐఐసీ ఏర్పాట్లు చేసింది. ఈ వెంచర్‌కు గోల్డెన్‌ మైల్‌ అని పేరు పెట్టారు. ఈ భూములకు కూడా భారీ ధర దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు.

నోట్ల వర్షం కురిపించి భూములను కొనుగోలు చేసిన వారి జాబితా..

విస్తీర్ణం

ఎకరాల్లో

ఎకరా ధర

రూ. కోట్లలో

చెల్లించిన మొత్తం

రూ. కోట్లలో

దక్కించుకున్న బిడ్డర్ 7.721 42.2 325.83 మన్నె సత్యనారాయణరెడ్డి 7.755 42.4 328.81 రాజపుష్ప ప్రాపర్టీస్ 7.738 36.4 281.66 ఆక్వా స్పేస్ డెవలపర్స్ 7.564 37.8 285.92 ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ 8.946 39.2 350.68 ఆక్వా స్పేస్ డెవలపర్స్ 7.575 39.2 296.94 వర్షిణి ఎడుకేషన్ మేనేజ్ మెంట్ 1.0 31.2 31.2 హైమా డెవలపర్స్ 1.65 60.2 99.33 రాజపుష్ప రియాల్టీ

ఇదీ చూడండి:KOKAPET LANDS: కోకాపేట భూముల విక్రయం ప్రారంభం.. కనీస ధర ఎంతంటే..

Last Updated : Jul 15, 2021, 10:18 PM IST

ABOUT THE AUTHOR

...view details