తెలంగాణ

telangana

ETV Bharat / state

గృహిణి ఆత్మహత్య - POLICE

ఎలాంటి సమస్యలతో బాధపడుతుందో... చివరికి మరణమే శరణమనుకుంది ఆ మహిళ. కానీ... తన పిల్లలు  అనాథలవుతారని మరచినట్టుంది... వారి ముందే నిర్జీవంగా పడి శోకసంద్రంలో ముంచి వెళ్లిపోయింది.

మమ్మల్నేందుకు వదిలెల్లావమ్మా..!

By

Published : Mar 2, 2019, 9:00 AM IST

Updated : Mar 2, 2019, 10:05 AM IST

మమ్మల్నేందుకు వదిలెల్లావమ్మా..!
హైదరాబాద్​ షేక్​పేటలో ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణం చెందింది. శారద, శ్రీనివాస్‌ దంపతులు సీతానగర్‌లో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. శ్రీనివాస్‌ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య తగాదాలే ఆత్మహత్యకు దారి తీసి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. విగతజీవిగా ఉన్న తల్లిని చూసి పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Mar 2, 2019, 10:05 AM IST

ABOUT THE AUTHOR

...view details