హైదరాబాద్ నేరెడ్మెట్ వాయుపురిలో హీరో సందీప్ కిషన్ సందడి చేశారు. వివాహ భోజనంబు హోటల్ 3వ ఔట్‌లెట్‌ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ జోగినపల్లి సంతోష్, హీరో సందీప్ కిషన్‌లు హాజరయ్యారు.
'వివాహభోజనంబును ఆదరిస్తున్న అందరికీ వందనం' - హీరో సందీప్ కిషన్ తాజా వార్త
వివాహ భోజనంబు హోటల్ మూడో బ్రాంచ్ని హైదరాబాద్ నేరెడ్‌మెట్‌లో హీరో సందీప్‌కిషన్, ఎంపీ జోగినపల్లి సంతోష్‌తో కలిసి ప్రారంభించారు. ఆహార ప్రియుల కోసం రానున్న రోజుల్లో మరిన్ని శాఖలను ప్రారంభించనున్నట్లు హీరో సందీప్ తెలిపారు.
'వివాహభోజనంబును ఆదరిస్తున్న అందరికీ వందనం'
వివాహ భోజనంబు ఆహారాన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి హీరో సందీప్ కిషన్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో నూతన బ్రాంచ్‌లను ప్రారంభిస్తామని, రానున్న రోజుల్లో ఆహార ప్రియులకోసం మరిన్ని బ్రాంచ్‌లు ఏర్పాటు చేయనున్నట్టు సందీప్ కిషన్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: మానవత్వం చాటిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి