కరోనాతో పోటీపరీక్షల శిక్షణ (Competitive exam training)లో మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో ఒకేసారి వందలమందిని పెద్దహాల్/ఫంక్షన్‌హాల్లో కూర్చోబెట్టి తరగతులు నిర్వహించేవారు. కొవిడ్ తర్వాత ఈ పద్ధతి మారింది. కోచింగ్ సెంటర్లు ఆన్‌లైన్లో శిక్షణ (Competitive exam training) ఇస్తున్నాయి. ప్రైవేటు యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఎక్కడైనా కూర్చుని పాఠాలు వినే పరిస్థితులు వచ్చాయి. శిక్షణ రుసుంలు తగ్గాయి. ‘‘ప్రత్యక్ష తరగతుల సమయంలో గ్రూప్-2 శిక్షణ (Competitive exam training) రుసుం రూ.16-20వేలు ఉంటే... ఇప్పుడు ఆన్‌లైన్లో రూ.8-10వేలకు లభిస్తోంది. కొందరు నిపుణులు యాప్‌ల ద్వారా ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ సమాచారం తెలుగు, ఆంగ్ల భాషల్లో అందిస్తున్నారు. ఎక్కువ డబ్బు చెల్లించలేని వాటితో శిక్షణ (Competitive exam training) పొందుతున్నారు’ అని నిరుద్యోగ అభ్యర్థి రాజ్‌కుమార్ తెలిపారు.
శిక్షణ కేంద్రాలు అంతంతే...
ఉద్యోగార్థుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కువ. వీరికోసం ఆయా సంక్షేమశాఖలు స్టడీ సర్కిళ్లను ఏర్పాటుచేసినప్పటికీ..ఉద్యోగ ప్రకటనలు వెలువడిన తరువాతే అవి శిక్షణను ఆరంభిస్తున్నాయి. శిక్షణ (Competitive exam training) కోరుకునే అభ్యర్థులు భారీగా ఉంటున్నా, అవి ఒక్కో బ్యాచ్‌లో 100 మందినే తీసుకుంటున్నాయి. కొత్తగా జిల్లాలు ఏర్పాటైనా ఆ మేరకు స్టడీసర్కిళ్లు రాలేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగ ప్రకటనలతో సంబంధం లేకుండా శిక్షణ (Competitive exam training) తరగతులు ప్రారంభించాలని యువత కోరుతోంది. ‘‘ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడే వారిలో పేద, మధ్య తరగతికి చెందినవారే ఎక్కువ. ప్రైవేటు వసతి గృహాల్లో ఉంటే నెలకు రూ.5-6 వేలు చెల్లించాల్సి ఉంటుంది. కరైంట్ అఫైర్స్ కోసం దినపత్రికలు, మ్యాగజైన్‌ల కొనుగోలుకు నెలకు రూ.500 వరకూ ఖర్చవుతోంది. ఈ సొమ్ముకోసం కొందరు ఖాళీ సమయాల్లో కేటగిరింగ్ పనులకు వెళ్తున్నారు. మరికొందరు జీహెచ్‌ఎంసీ అందించే రూ.5 భోజనంతో ఆకలి తీర్చుకుంటున్నారు’ అని ఓ నిరుద్యోగి ఆవేదన వ్యక్తంచేశారు.
పార్కులు, లైబ్రరీలో సన్నద్ధత...
హైదరాబాద్‌లో అశోక్‌నగర్, అమీర్‌పేట, మెహిదీపట్నం, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లో పోటీపరీక్షల శిక్షణ (Competitive exam training) కేంద్రాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వాటిలో శిక్షణ (Competitive exam training) కోసం యువకులు భారీగా హైదరాబాద్ బాటపడుతున్నారు. ఇప్పటికే పలు కేంద్రాలు శిక్షణ ప్రారంభించాయి. తరగతుల అనంతరం అభ్యర్థులు పుస్తకాలు చేతపట్టి చిక్కడపల్లి, అఫ్జల్‌గంజ్ లైబ్రరీ లేదా సమీపంలోని పార్కులకు చేరుకుంటున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ ప్రధాన కేంద్రంగా మారింది. రోజూ వందల మంది ఇక్కడ పుస్తకాలతో కుస్తీపడుతున్నారు.
- ‘లైబ్రరీలో చదువుకునేందుకు అనువైన వాతావరణం ఉంది. ఒకరిని చూసి మరొకరం పోటీపడొచ్చు. సందేహాలు తలెత్తినప్పుడు మరొకర్ని అడిగి నివృత్తి చేసుకునేందుకూ అవకాశం ఉంటుంది’ అని వనపర్తికి చెందిన అభిషేక్ తెలిపారు.
- రెండేళ్ల క్రితమే డిగ్రీ పూర్తయిందని, రైల్వే గ్రూప్-డి పరీక్షకు సిద్ధమయ్యేందుకు హైదరాబాద్ వచ్చానని, తరగతుల అనంతరం లైబ్రరీకి వస్తున్నానని మరో యువకుడు తెలిపారు.
స్పష్టమైన ప్రకటనలివ్వాలి
ఎంసీఏ పూర్తికాగానే గ్రూప్-1, 2 కోసం శిక్షణ (Competitive exam training) తీసుకున్నా. ఇప్పటికీ గ్రూప్-1 ప్రకటన రాలేదు. గ్రూప్-2 పరీక్ష రాసినా ఉద్యోగం రాలేదు. ప్రభుత్వం మళ్లీ ఉద్యోగ ప్రకటనలు ఇస్తామంటోంది. ఈసారి స్పష్టమైన హామీతో ప్రకటనలు ఇవ్వాలి.
- రమేష్, నల్గొండ
రెండేళ్లుగా ఇక్కడే సన్నద్ధత
మాది ఖమ్మం జిల్లా. నాన్న చిన్నపుడే చనిపోయారు. అమ్మ కూలిపని చేసి చదివించింది. రెండేళ్ల క్రితం ఎస్సై పరీక్ష రాశా. గణితంలో తగినన్ని మార్కులు రాలేదు. మరోసారి పోటీపడేందుకు రెండేళ్లుగా హైదరాబాద్‌లోనే ఉంటూ చదువుకుంటున్నా. వయోపరిమితి దాటకముందే ఉద్యోగ ప్రకటనలు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.