తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనాపై పోరులో తెలంగాణ పోలీసులకు కేంద్రం కితాబు' - హోం మంత్రి మహమూద్‌ ఆలీ పోలీస్‌ ఆధికారులతో సమీక్ష

కరోనాపై పోరులో లాక్​డౌన్​ను పకడ్బందీగా అమలు చేయడంలో రాష్ట్ర పోలీసుల పనితీరు ప్రశంసనీయమని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. రాష్ట్ర పోలీసుల సేవలకు కేంద్ర బృందం సైతం కితాబిచ్చిందని తెలిపారు.

home minister review meeting with zonals dcp at hyderabad
కరోనాపై పోరులో తెలంగాణ పోలీసులకు కేంద్రం కితాబు

By

Published : Apr 30, 2020, 11:40 AM IST

తెలంగాణలో లాక్​డౌన్​ను పకడ్బందీగా అమలు చేసేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారని హోం మంత్రి మహమూద్ అలీ తెలిపారు. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్​తోపాటు అన్ని జోన్ల డీసీపీలతో ఆయన సమీక్ష నిర్వహించారు.

విధుల్లో పోలీసులపై కొందరు దురుసుగా ప్రవర్తిస్తున్నారని, వారిని ఉపేక్షించేది లేదన్నారు. రంజాన్ ఉపవాసం ఉండేవారు నిత్యావసరాల కోసం వస్తే కొంత సానుకూలంగా వ్వవహరించాలని పోలీసులకు సూచించారు. ప్రతి డీసీపీ రోజుకు రెండు పోలీసు స్టేషన్లు తనిఖీ చేయాలని సూచించారు.

ఇదీ చూడండి:చరవాణి ఉందా.. చెంతనే వైద్యమిక!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details