తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీస్ శాఖలో విప్లవాత్మకమైన చర్యలు తీసుకున్నట్లు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పోలీస్ శాఖలో అనేక సంస్కరణలు చేపట్టామని తెలిపారు. ప్రజామిత్ర పోలీసింగ్ ద్వారా క్షేత్ర స్థాయిలో అనేక మార్పులు జరిగాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు మరింత పటిష్టంగా మారాయని పేర్కొన్నారు. 350 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మకమైన పోలీస్ టవర్ల నిర్మాణం తుది మెరుగులు దిద్దుకుంటోందని అన్నారు.
ఆధునిక హంగులతో...
ఆధునిక హంగులతో పోలీస్ భవనాలు నిర్మిస్తున్నట్లు అలీ చెప్పారు. రెండు భవనాల్లో ఒకటి 19 అంతస్తులు కాగా... మరొకటి 14 అంతస్తులని వివరించారు. ప్రపంచ స్థాయి బహుళ సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేయాలని మహమూద్ అలీ అధికారులను ఆదేశించారు. డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి హోం మంత్రి మహమూద్ అలీ పోలీసు టవర్స్‌ను సందర్శించారు. అనంతరం నిర్మాణ పనులను పరిశీలించారు.
పోలీస్ టవర్స్ నిర్మాణాలను సందర్శించిన మహమూద్ అలీ ఇవీ చూడండి : అనిశా కోర్టుకు ఎంపీ రేవంత్ రెడ్డి