హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను కేంద్రమంత్రి కిషన్రెడ్డి, భాజపా ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
దత్తాత్రేయను కలిసిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి, లక్ష్మణ్ - Kishan Reddy meets Dattatreya
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయను తన నివాసంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి, లక్ష్మణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. దత్తాత్రేయ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
దత్తాత్రేయను కలిసిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి, లక్ష్మణ్
హైదరాబాద్ రాంనగర్లోని దత్తాత్రేయ నివాసానికి వెళ్లిన కిషన్రెడ్డి, లక్ష్మణ్... ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భాజపా గణనీయమైన సీట్లు గెలిచిన నేపథ్యంలో లక్ష్మణ్ బండారు దత్తాత్రేయ శాలువాతో సన్మానించారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగిందని ఆయనకు వివరించారు. రాబోవు రోజుల్లో కూడా పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని దత్తాత్రేయ వారికి సూచించారు.
- ఇదీ చదవండి :కరోనాకు తోడైన కల్తీ.. ప్రమాదకరంగా ఆహారం
Last Updated : Dec 14, 2020, 11:50 AM IST