తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ నిర్ణయాలపై న్యాయసమీక్ష చేయరాదు: ఏజీ

high court inquiry
ప్రభుత్వ నిర్ణయాలపై న్యాయసమీక్ష చేయరాదు: ఏజీ

By

Published : Mar 3, 2020, 5:23 PM IST

Updated : Mar 3, 2020, 8:07 PM IST

17:16 March 03

సచివాలయం కూల్చివేత వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ

ప్రభుత్వ నిర్ణయాలపై న్యాయసమీక్ష చేయరాదు: ఏజీ

       ప్రభుత్వం తీసుకునే రాజ్యాంగబద్ధమైన నిర్ణయాలపై కోర్టులు న్యాయ సమీక్ష చేయరాదని ప్రభుత్వం వాదించింది. రాజకీయ ప్రత్యర్థులు దురుద్దేశపూరితంగా సచివాలయం అంశంపై వ్యాజ్యాలు దాఖలు చేశారని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదించారు. సచివాలయం కూల్చివేతకు సంబంధించిన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డితో కూడిన ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది.  

నిపుణుల కమిటీ చెప్పింది

        ప్రభుత్వ పాలసీలు చట్టబద్ధంగా, సహేతుకంగా ఉన్నప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో పేర్కొందని తీర్పులను ఏజీ ప్రస్తావించారు. ప్రస్తుత సచివాలయ భవనాలు మరమ్మతుకు వీల్లేకుండా ఉన్నాయని.. కొత్తవి నిర్మించాలని నలుగురు ఇంజినీరింగు నిపుణుల కమిటీ స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వం చెప్పిన విధంగా ఇంజినీర్లు నివేదిక ఇచ్చారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తరఫు న్యాయవాది సత్యంరెడ్డి వాదించారు.  

మేము ఇంజినీర్లం కాదు

        నిపుణులు చెప్పిన అంశాన్నే తాము పరిగణనలోకి తీసుకుంటామని.. విద్యుత్ వైరింగ్, ఫైరింగ్ వంటి సాంకేతిక అంశాలను తేల్చడానికి తాము ఇంజినీర్లం కాదు కదా అని ధర్మాసనం పేర్కొంది. నివేదిక వాస్తవమా కాదా అనేది సివిల్ కోర్టులు తేలుస్తాయి కానీ హైకోర్టు కాదని తెలిపింది. సచివాలయం స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వంతో సంబంధం లేదని స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని జీవన్​రెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. పూర్తి స్థాయి వాదనల కోసం వ్యాజ్యాలను ఎల్లుండికి వాయిదా వేసింది.

ఇవీ చూడండి: 'అక్రమ నిర్మాణాలు తొలగించాలంటే అరెస్టులా?'

Last Updated : Mar 3, 2020, 8:07 PM IST

ABOUT THE AUTHOR

...view details