అరేబియా మహా సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం గురువారంలోపు వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనికి అనుబంధంగా 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉంది. కోస్తాంద్ర తీరానికి సమీపాన వాయుగుండం ఏర్పడినందున తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది!
వాతావరణశాఖ హెచ్చరిక... నాలుగు రోజులపాటు వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతోంది. దీని ప్రభావంతో వచ్చే నాలుగురోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
'రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు'