తెలంగాణ

telangana

ETV Bharat / state

hyd rains: నగరంలో పలుచోట్ల వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

భాగ్యనగరంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. నగరంలో ఒక్కసారిగా వాన కురవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్టారు. వర్షపు నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాగల రెండు రోజుల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు.

hyd rains
నగరంలో పలుచోట్ల వర్షం

By

Published : Sep 13, 2021, 5:59 PM IST

హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం పడుతోంది. చార్మినార్‌, బహదూర్‌పురా, చాంద్రాయణ గుట్ట ప్రాంతాల్లో జోరుగా వాన కురుస్తోంది. ఖైరతాబాద్‌ ప్రాంతంలో ఒక్కసారిగా కురిసిన వర్షానికి వాహనదారులు ఇబ్బందులు పడ్టారు. సైదాబాద్‌, చంపాపేట, సరూర్‌నగర్‌, హయత్‌నగర్‌లో రహదారిపై నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలకు వరద పోటెత్తుతోంది.

మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లోనూ వాన పడుతోంది. మరో 24 గంటలపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల రెండు రోజుల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ములుగు, జయశంకర్ భూపాల్‌పల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, కుమురం భీం, జగిత్యాల, ఆదిలాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ సంచాలకులు తెలిపారు.

భాగ్యనగరంలో పలుచోట్ల వర్షం

ఇదీ చూడండి: RAINS: రానున్న రెండు రోజుల్లో.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

ABOUT THE AUTHOR

...view details