తెలంగాణ

telangana

By

Published : Apr 20, 2020, 7:59 PM IST

ETV Bharat / state

భాగ్యనగరంలో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం

రాష్ట్ర రాజధానిలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉపరితల ద్రోణి వల్ల పెద్ద ఎత్తున గాలిదుమారంతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు చోట్ల కురిసిన వడగళ్ల వానకు విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది.

heavy-rain-due-to-climate-changes-in-hyderabad
భాగ్యనగరంలో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం

హైదరాబాద్​ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉపరితల ద్రోణితో పెద్ద ఎత్తున గాలిదుమారంతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రంగా ఉన్నా సాయంత్రానికి వాతావరణం మారిపోయింది. సూరారం, జీడిమెట్ల, షాపూర్​నగర్​ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బండ్లగూడ జాగీర్, శంషాబాద్​లో కురిసిన భారీ వర్షానికి విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది.

ABOUT THE AUTHOR

...view details