తెలంగాణ

telangana

ETV Bharat / state

డిపో మేనేజర్​ వేధింపులు తట్టుకోలేక కండక్టర్​కు గుండెపోటు - heart attack to rtc driver in hyderabad

ముషీరాబాద్-2 డిపోకు చెందిన ఓ ఆర్టీసీ కార్మికుడు డిపో మేనేజర్ వేధింపులు తట్టుకోలేక మానసిక వేదనకు గురై ఆసుపత్రి పాలయ్యాడు. గుండెపోటు రావడంతో కార్మికులు ముషిరాబాద్​లోని కేర్​ ఆస్పత్రికి తరలించారు.

heart-attack-to-rtc-driver-in-hyderabad
డిపో మేనేజర్​ వేధింపులు తట్టుకోలేక కండక్టర్​కు గుండెపోటు

By

Published : Jan 6, 2020, 6:02 AM IST

హైదరాబాద్ ముషీరాబాద్-2 డిపోకు చెందిన కండక్టర్ గుండెపోటుతో డిపో ఆవరణలో కుప్పకూలాడు. కండక్టర్ పాండురంగారావు గత రాత్రి కలెక్షన్ తక్కువ తీసుకు వచ్చాడని డిపో మేనేజర్ కృపాకర్ రెడ్డి అతడిని మందలించారని డిపో కార్మికులు తెలిపారు. ప్రతిరోజు మాదిరిగా ఈ రోజు ఉదయం పాండురంగారావు విధులకు హాజరయ్యారు. డీయం కలెక్షన్ తక్కువగా తీసుకొచ్చావని అనడం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురై గుండె పోటుతో డిపో ఆవరణలో స్పృహ కోల్పోయాడు. వెంటనే అతడిని ఆర్టీసీ బస్సులో చికిత్స నిమిత్తం తార్నాక ఆర్టీసీ ఆస్పత్రికి తరలించారు. తార్నాక ఆర్టీసీ ఆస్పత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం ముషీరాబాద్ లోని కేర్ ఆస్పత్రికి పాండురంగారావును తరలించి చికిత్స అందిస్తున్నారు. అధికారుల వేధింపులు రోజురోజుకు పెరుగుతున్నాయని... ఈ వేధింపులు ఆపని పక్షంలో ఆందోళన బాట పడతామని పలువురు కార్మికులు హెచ్చరించారు.

డిపో మేనేజర్​ వేధింపులు తట్టుకోలేక కండక్టర్​కు గుండెపోటు

ABOUT THE AUTHOR

...view details