ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్క కరోనా పోసిటివ్ కేస్ కూడా లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. గతంలో కరోనా సోకిన యువకుడు పూర్తిగా కోలుకున్న నేపథ్యంలో త్వరలో గాంధీ నుంచి డిశ్చార్జ్ చేయనున్న తెలిపారు.
ఐదు ఆస్పత్రుల్లో చికిత్స అందుబాటులోకి
కరోనాపై గాంధీ, ఉస్మానియాలో చికిత్స అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. కొత్తగా మరో మూడు ఆస్పత్రుల్లో పరీక్షలకు అనుమతి వచ్చిందని వివరించారు. వరంగల్ ఎంజీఎం, ఐపీఎం హైదరాబాద్, ఫీవర్ ఆస్పత్రుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఐదు ఆస్పత్రుల్లోనూ అవసరమైన సిబ్బంది, కిట్స్ సరఫరా చేస్తున్నామన్న మంత్రి... పూర్వ 9 జిల్లాల్లోని ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు, ఐసీయూలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. కరోనా రోగులు వదిలిన గాలి, తుంపర్లను శుద్ధి చేసేందుకు త్వరలో గాంధీ సహా మరో రెండుమూడు చోట్ల హెపా ఫిల్టర్లను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.
కరోనాపై ఆందోళన అవసరం లేదు: మంత్రి ఈటల ఇవీ చూడండి: పోరు దిశగా కాంగ్రెస్... నిలువరించే పనిలో తెరాస