Hair Loss in Men :ఈ మధ్యకాలంలో మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల జుట్టు రాలడం అనేది ప్రతి మనిషిలోనూ సర్వసాధారణంగా మారిపోయింది. వయసుతో సంబంధం లేకుండా ఆడ, మగ, చిన్నాపెద్ద ఇలా అందరిలోనూ ఈ సమస్య తలెత్తుతోంది. పాతికేళ్లు రాకముందే చాలామందిలో జుట్టు రాలే సమస్య పెరుగుతోంది. తాజాగా ప్రముఖ సౌందర్య ఉత్పత్తుల సంస్థ దేశవ్యాప్తంగా 50 వేల మంది పురుషులపై అధ్యయనం చేసింది. భారతీయ పురుషుల్లో జుట్టు రాలే సమస్య 50.31 శాతం మంది 25 వయస్సులోపు వారేనని అధ్యయనంలో గుర్తించారు
Cause of Hair Loss in Men : పాతికేళ్లు రాకముందే చాలామందిలో జుట్టు రాలేసమస్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా జరిగిన అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమైంది. ప్రముఖ సౌందర్య ఉత్పత్తుల సంస్థ దేశవ్యాప్తంగా 50 వేల మంది పురుషులపై అధ్యయనం చేసింది. సోమవారం ఈ ఫలితాలను విడుదల చేసింది. జుట్టు రాలే సమస్య ఉన్న భారతీయ పురుషుల్లో 50.31 శాతం మంది 25 వయస్సులోపు వారేనని అధ్యయనంలో గుర్తించారు. 21 ఏళ్ల కంటే తక్కువ వయసు వారిలోనూ 25.89 శాతం మంది జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. సగటున 28 ఏళ్ల వారిలో జట్టు రాలిపోవడం తీవ్ర ఆందోళనగా మారిందని అధ్యయనం పేర్కొంది. జుట్టు రాలిపోయే సమస్య ఉన్న వారిలో 65 శాతం చుండ్రు వల్ల బాధపడుతున్నట్లు గుర్తించారు.
జుట్టు, చర్మ సమస్యలకు ఉసిరితో చెక్! ఇమ్యూనిటీతో పాటు ప్రయోజనాలెన్నో
కేశాలు రాలే వారిలో ప్రతి పది మందిలో ఆరుగురు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. దీనికితోడు వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఇందుకు దోహదం చేస్తున్నట్లు నిపుణులు వెల్లడించారు. జీర్ణకోశ సమస్యలైన ఉబ్బరం, గ్యాస్, ఆహారం జీర్ణం కాకపోవడం వల్ల శరీరానికి తగిన పోషకాలు అందక.. ఆ ప్రభావం జుట్టు ఆరోగ్యంపై పడుతుందన్నారు. జుట్టు రాలే సమస్య ఉన్న ప్రతి పది మందిలో ముగ్గురు నిద్ర లేమితో బాధపడుతున్నట్లు అధ్యయనం వెల్లడించింది.
మరి జుట్టు రాలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఓసారి తెలుసుకుందామా..?
- రోజూ తీసుకునే భోజనం మీదే జుట్టు సంరక్షణ కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి తళతళలాడే జుట్టు కోసం పోషకాలు మెండుగా ఉండే కీర దోసకాయ, పుచ్చకాయ, బచ్చలి కూర, బ్రొకోలి లాంటివి తరచూ వండుకుని తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
- పాలు, పాల సంబంధిత పదార్థాల్లో ఎముకలకు బలాన్ని ఇచ్చే క్యాల్షియమే కాదు.. వెంట్రుకలకు ఆరోగ్యాన్నిచ్చే బయోటిన్ కూడా దొరుకుతుంది. రోజూ ఓ గ్లాసు తీసుకుంటే సరి.
- గుడ్లలో అధిక శాతం ప్రొటీన్ ఉండటం వల్ల ఇవి మన జుట్టు మృదువుగా ఉండేందుకు సహజ కండీషనర్లుగా పనిచేస్తాయి. వీటిని వారానికి ఒకటి లేదా రెండు సార్లు తీసుకుంటే మంచిది.
- వీటితో పాటు నిమ్మ, నారింజ పండ్లనీ తీసుకోవచ్చు. వీటి ద్వారా మనకు కావాల్సిన ఫోలేట్ అందుతుంది. కాబట్టి రోజువారీ ఆహారంలో ఇవి తీసుకుంటే మంచిది.
Hair Growth Tips : మీ జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలా?.. ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే చాలు!
జుట్టు రాలిపోతోందా? కారణాలు అవే కావొచ్చు.. ఇలా చేస్తే సెట్!