కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అర్హులైన పేదలు, గిరిజనులకు వ్యాక్సిన్ ఇవ్వడం ప్రధాన లక్ష్యమని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. పుదుచ్చేరి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెడ్ క్రాస్ యూనిట్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. జిల్లాల్లోని యూనిట్ల ప్రతినిధుల పనితీరుపై సమీక్ష జరిపారు.
గిరిజనులకు కరోనా వ్యాక్సిన్ వేయించాలి:గవర్నర్ - తెలంగాణ గవర్నర్ తమిళిసై
గిరిజనులకు కరోనా వ్యాక్సిన్ వేయించాలని గవర్నర్ తమిళిసై సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెడ్‌క్రాస్ యూనిట్ ప్రతినిధులతో ఆమె భేటీ అయ్యారు. వ్యాక్సినేషన్ కేంద్రాలకు గిరిజనులను తీసుకురావాలని ఆదేశించారు. రెడ్‌క్రాస్ ఆర్బన్ జిల్లా యూనిట్లకు గవర్నర్ ఈ సందర్భంగా నిధులు మంజూరు చేశారు.
గిరిజనులకు కరోనా వ్యాక్సిన్ వేయించాలి:గవర్నర్
రెడ్‌క్రాస్ సొసైటీతో పనిచేసేందుకు వాలంటీర్లు ముందుకు రావాలని తమిళిసై కోరారు. సుదూర ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు కరోనాపై అవగాహన కల్పించడం, టీకా ఇవ్వడం... చాలా కష్టంతో కూడుకున్నదని చెప్పారు. ఆదివాసీలను వ్యాక్సినేషన్ సెంటర్ల వద్దకు తీసుకు వచ్చి టీకా వేయించేందుకు... రెడ్‌క్రాస్ ఆర్బన్ యూనిట్లకు లక్ష రూపాయలు, జిల్లా యూనిట్లకు 50 వేల రూపాయల చొప్పున ముంజూరు చేశారు.
ఇదీ చూడండి :కరోనాపై పోరు... కరీంనగర్లో మాస్క్ వాల్ అవగాహన
Last Updated : Apr 17, 2021, 5:23 AM IST