కార్పొరేట్ శక్తులకు లొంగుతున్న ప్రభుత్వాలు - Governments that succumతెజస అధ్యక్షుడు కోదండరాం b to corporate power
ప్రభుత్వాలన్ని కార్పొరేట్ సంస్థల ధనసంపత్తి ముందు లొంగిపోతున్నాయని తెజస అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. కార్పొరేట్ అధ్యాపకులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ..ఈ నెల 27న చేపట్టనున్న బంద్‌కు ఆయన మద్దతునిచ్చారు.
కార్పొరేట్ కళాశాల్లో విద్యా బోధన ఆధునికమని..నడిపేతీరేమో మధ్యయుగాల మాదిరిగా ఉందని తెజస అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. అధ్యాపకులకు కనీస వేతనం ఇవ్వకుండా ఎక్కువ గంటలు పనిచేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కూడా కార్పొరేట్ శక్తుల తీరు మారకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. ఒకే పేరుతో పదుల సంఖ్యలో కళాశాలలు నడపడం సరికాదన్నారు. కార్పొరేట్ అధ్యాపకులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ..ఈ నెల 27న చేపట్టనున్న బంద్‌కు మద్దతునిచ్చారు. వారి సమస్యలు పరిష్కరించే వరకు కలసి పోరాడుతానని స్పష్టం చేశారు.