రాష్ట్రంలో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రంలో మాస్కులు లేకుండా బయటకు రావొద్దని ఆదేశాలు జారీచేసింది. అందులో భాగంగా పలు స్వచ్ఛంద సంస్థలు... పలువురు సొంతంగా మాస్కులు కుట్టి ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. లాక్డౌన్ ఉన్నా తన విధులు నిర్వహిస్తూనే... సమాజానికి తన వంతు సేవ చేస్తున్నారు గవర్నర్ వ్యక్తిగత భద్రత అధికారి అమరేశ్వరి.
మాస్కులు ఉచితంగా పంపిణీ చేస్తూ సమాజానికి సేవ - covid-19 news
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంలో సమాజానికి సేవ చేయాలని పూనుకున్నారు గవర్నర్ వ్యక్తిగత భద్రత అధికారి అమరేశ్వరి. సొంతంగా మాస్కులు కుట్టి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
మాస్కులు ఉచితంగా పంపిణీ చేస్తూ సమాజానికి సేవ
ఖాళీ సమయంలో తానే స్వయంగా మాస్కులు కుడుతూ ఇంటింటికి వెళ్లి అందిస్తోంది. ఇప్పటి వరకు 3 వేలకు పైగా మాస్కులు కుట్టి ఉచితంగా పంపిణీ చేసింది. కరోనా మహమ్మారి పూర్తిగా వెళ్లే వరకు తయారు చేస్తూ.. పంపిణీ చేస్తానని గవర్నర్ వ్యక్తిగత భద్రత అధికారి అమరేశ్వరి తెలిపారు.
ఇవీ చూడండి:తెలంగాణ, ఏపీల్లో హాట్‌స్పాట్ జిల్లాలివే..
Last Updated : Apr 16, 2020, 7:07 AM IST