తెలంగాణ

telangana

ETV Bharat / state

'స్వచ్ఛ ఆటో డ్రైవర్ మల్లయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి'

నిత్యం ఇంటింటికీ తిరిగి చెత్త సేకరిస్తున్న తమకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని కంటికి కనపడని కరోనాతో పరోక్షంగా పోరాటం చేస్తున్నామని స్వచ్ఛ ఆటో డ్రైవర్ అసోసియేషన్ పేర్కొనింది. ఇటీవలి కాలంలో కరోనాతో మరణించిన జీహెచ్ఎంసీ స్వచ్ఛ ఆటో డ్రైవర్ మల్లయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరింది.

GHMC SWACHA AUTO DRIVERS PROTEST AT HYDERABAD
'మాకు భద్రత కల్పించండి.. మరణించిన వారి కుటుంబాలను ఆదుకోండి'

By

Published : Jul 8, 2020, 3:07 PM IST

ఇటీవల కరోనా వ్యాధితో మరణించిన జీహెచ్ఎంసీ స్వచ్ఛ ఆటో డ్రైవర్ సంగెం మల్లయ్య కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రేటర్​ హైదరాబాద్ స్వచ్ఛ ఆటో డ్రైవర్ అసోసియేషన్ కోరింది. తెలంగాణ రాష్ట్ర కార్మిక విభాగం, ఎల్బీనగర్ అధ్యక్షుడు శ్రవణ్​ కుమార్​తో కలిసి సరూర్​నగర్​ శానిటేషన్​ విభాగం డీఈ నీలిమకు వారు వినతిపత్రం అందజేశారు.

ఇంటింటికి తిరిగి చెత్త సేకరిస్తున్న తాము అనేక ఇబ్బందులు పడుతూ కరోనాతో పోరాటం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం స్వచ్ఛ ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్సు, హెల్త్ కార్డులు కల్పించాలని శానిటైజర్, మాస్కులు, గ్లౌజులు ఇవ్వాలని కోరారు. మరణించిన మల్లయ్య కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి:ప్రైవేట్​లో వైద్యానికి నో చెప్పొద్దు.. ఫీజులెక్కువ అడగొద్దు: గవర్నర్

ABOUT THE AUTHOR

...view details