లాక్‌డౌన్ నేపథ్యంలో నగరంలో ఉండిపోయిన వలస కార్మికులతోపాటు నిర్వాసితులు, అనాథలకు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో భోజన వసతులు కల్పించినట్లు నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. ఇందులో భాగంగా వీరి కోసం నగరంలో 27 షెల్టర్ హోంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే 97 స్వచ్చంద సంస్థల సహకారంతో వలస కార్మికులు, అనాథలకు ఆశ్రయం కల్పించినట్లు తెలిపారు. బన్సీలాల్‌పేట మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెల్టర్ హోంను మేయర్ రామ్మోహన్ తనిఖీ చేశారు.
'అభాగ్యుల కోసం 27 షెల్టర్ హోంలు ఏర్పాటు చేశాం'
లాక్‌డౌన్ నేపథ్యంలో వలసకార్మికులతో పాటు నిర్వాసితులు, అనాథలకు నగరంలో 27 షెల్టర్ హోంలు ఏర్పాటు చేసినట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.
నగరంలో ఏ ఒక్కరూ ఆకలితో ఇబ్బందిపడకూడదనే ఉద్దేశంతో జీహెచ్‌ఎంసీ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. షెల్టర్ హోంలలో ఉంచినవారికి అన్నపూర్ణ మొబైల్ క్యాంటీన్ ద్వారా నాణ్యమైన పోషకాహారాన్ని అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ హోంలో ఉంటున్న 200మందికి రెండు పూటల భోజనం, మాస్క్‌లు, శానిటైజర్లు అందించి... వైద్యసేవలు అందుబాటులో ఉంచినట్లు మేయర్ వివరించారు. లాక్‌డౌన్ ముగిసేవరకు దాతలు తమ సహకారాన్ని ఇదే విధంగా కొనసాగించాలని మేయర్ విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: ఆన్లైన్ పాఠాలను ప్రారంభించిన మంత్రి సత్యవతి రాఠోడ్